ఆవిరి – టైటిల్ కి తగ్గ పోస్టర్

Wednesday,September 11,2019 - 03:42 by Z_CLU

రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ఆవిరి’ సినిమా ఫస్ట్ లుక్  పోస్టర్ రిలీజయింది. గతంలో జస్ట్ టైటిల్ అనౌన్స్ చేసి క్యూరియాసిటీ రేజ్ చేసిన మేకర్స్ ఇప్పుడీ డిఫెరెంట్ పోస్టర్ తో సినిమాపై క్యూరియాసిటీ జెనెరేట్ చేస్తున్నారు.

రవిబాబు సినిమాలంటే డిఫెరెంట్ గా ఉంటాయనే ఇమేజ్ కొత్తది కాకపోయినా, ఈ పోస్టర్ మాత్రం ఈ సినిమా ఏ జోనర్ లో ఉండబోతుందనేది కూడా రివీల్ చేయకుండా ఎట్రాక్ట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా టైటిల్ కి తగ్గట్టు.. ‘ప్రెషర్ కుక్కర్.. అందులో ఓ అమ్మాయి కళ్ళు’ కనిపించేలా ఉండేసరికి, అసలు ఈ సినిమాలో కుక్కర్ కి… ఆవిరికి  సంబంధమేమై ఉంటుందనే క్యూరియాసిటీ రేజ్ అవుతుంది.

చూడాలి మరీ రవి బాబు ఈ పోస్టర్ ని కథతో ఎలా జస్టిఫై చేయబోతున్నాడో. రవిబాబు, నేహా చౌహాన్, శ్రీ ముక్త నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. దిల్ రాజు ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.