రుణం తీర్చుకుంటున్న నాని..... 

Saturday,November 26,2016 - 05:40 by Z_CLU

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని…  పిట్టగోడ అనే ఓ చిన్న సినిమాను ప్రమోట్ చెయ్యడానికి రెడీ అయిపోయాడు. గతంలో  అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన రామ్మోహన్‌ ఈ పిట్టగోడకు కూడా నిర్మాత. ఈ సినిమాకు ఫస్ట్‌ లుక్‌ను, మోషన్‌ పోస్టర్‌ను నేచురల్‌ స్టార్‌ నాని తాజాగా విడుదల చేశాడు. ఈ సినిమాకు నాని ఇలా బ్రాండ్ అంబాసిడర్ గాా మారడానికి ఓ కారణం ఉంది.

pitta-goda-first-look

 ‘అష్టా చమ్మా’ సినిమాతో తనను హీరోగా పరిచయం నిర్మాత రామోహ్మన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తన వంతుగా ప్రమోషన్ బాధ్యతను స్వీకరించాడు నాని. కేవలం ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ తోనే ఆగకుండా ఆడియో వేడుకకు కూడా గెస్ట్ గా హాజరై సినిమాను ప్రేక్షకుల మధ్యకు చేర్చాలని డిసైడ్ అయ్యాడట. తనను హీరోగా పరిచయం చేసిన నిర్మాత కోసం నాని ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. విశ్వదేవ్‌ రాచకొండ హీరోగా, పునర్నవి భూపాలం హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ లోకి ఎంటరైంది. డిసెంబర్ లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.