ధృవ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్

Saturday,November 26,2016 - 06:35 by Z_CLU

రామ్ చరణ్ ధృవ సినిమాకు సంబంధించి ఆడియో ఫంక్షన్ పెట్టలేదు. పాటల్ని నేరుగా మార్కెట్లోకి విడుదల చేశారు. రిలీజ్ కు ముందు ఓ భారీ ఫంక్షన్ పెట్టి సినిమాకు గ్రాండ్ గా వెల్ కం చెప్పాలనేది మెగ్ ప్లానింగ్. దీన్నే ఇప్పుడు ముద్దుగాా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అని పిలుస్తున్నాం. గతంలో సరైనోడు సినిమాకు ఇదేే ట్రెండ్ ఫాలో అయ్యారు. ఇప్పుడు ధృవకు కూడాా అదే ఫార్మాట్ కు ఫిక్సయ్యారు.

siv_38440047

మొన్నటివరకు ఈ సినిమా ప్రీ-రిలీజ్ డేట్ పై సస్పెన్స్ ఉండేది. తాజాగా జరిగిన ట్రయిలర్ లాంఛ్ సందర్భంగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్,, ప్రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు. డిసెంబర్ 4న ధృవ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఉంటుందని ప్రకటించాడు. అయితే ఈసారి విశాఖలో ఫంక్షన్ పెడతాారా.. లేక హైదరాబాద్ కే ఫిక్స్ అవుతారా అనేది మాత్రం తేేలలేదు. తాజా సమాచారం ప్రకారం… ధృవ ప్రీ-రిలీజ్ వేడుకను తిరుపతిలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.