మహేష్ కథతో మెగా హీరో....

Saturday,November 26,2016 - 04:33 by Z_CLU

సినిమా పరిశ్రమ లో కొన్ని కథలు కొందరు హీరోల దగ్గర తిరుగుతూ వచ్చి ఓ హీరో కి ఫిక్స్ అవ్వడం సహజమే. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇలా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అయితే లేటెస్ట్ గా ఓ కథ సూపర్ స్టార్ మహేష్ వద్దకు వెళ్లిందట. ఆ కథ మహేష్ కి కూడా బాగా నచ్చిందట. కానీ కట్ చేస్తే ఆ కథ మెగా హీరో కి ఫిక్స్ అయి సెట్స్ పైకి వెళ్ళింది.

     ఇదేంటి? ఏమిటా కథ? మహేష్ కథ మెగా కాంపౌండ్ కి ఎలా వెళ్లిందా? అనుకుంటున్నారా? ఇది నిజమే. టాలీవుడ్ లో ఈ వార్త మొన్నటి వరకూ ఎవ్వరికీ తెలియదు కానీ తాజాగా ఆ చిత్ర దర్శకుడు ఆ వార్త ను బయట పెట్టడం తో  విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

sekhar-kammula-is-finally-out-46368284

 యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాల దర్శకుడు  శేఖర్ కమ్ముల మహేష్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడనే వార్త ఇండస్ట్రీలో ఆమధ్య చక్కర్లుకొట్టింది.  మహేష్ ను కలిసి ‘ఫిదా’ సినిమా కథను వినిపించాడట శేఖర్ కమ్ముల. మహేష్ కి ఈ కథ నచ్చింది కానీ డేట్స్ కారణంగానే ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఈ సినిమా చేస్తున్నానని ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు శేఖర్ కమ్ముల. అలాా మహేష్ ఫిదా అయిన సినిమా.. వరుణ్ తేజ్ ను వరించింది.