రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నమ్రత...

Saturday,February 11,2017 - 03:26 by Z_CLU

ఒకప్పటి మిస్ ఇండియా, హీరోయిన్ నమ్రత శిరోద్కర్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం మహేష్ బాబు భార్య గా ఆయన కి సంబంధించిన వ్యాపారాలను చూసుకుంటున్న నమ్రత ఇటీవలే ఓ ప్రయివేట్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరై త్వరలోనే ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటించబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఆ సినిమా ఏ భాషలో ఉంటుంది… ఆ సినిమాలో క్యారెక్టర్ ఏంటి అనే విషయాన్నీ మాత్రం చెప్పలేదు.

ఉన్నట్టుండి నమ్రత సినిమా చేయబోతున్నట్లు చెప్పడంతో ఈ భామ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రీజన్ ఏంటి… ఇంతకీ నమ్రత నటించబోయేది ఏ సినిమాలో….అనే ప్రశ్నలు టాలీవుడ్ లో మొదలయ్యాయి. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.