ప్రభాస్ కోసం బాలీవుడ్ హీరోయిన్

Saturday,May 23,2020 - 12:38 by Z_CLU

ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్ లో 20వ సినిమా చేస్తున్న ప్రభాస్… నెక్స్ట్ నాగ్ అశ్విన్ తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్టులో నటీనటుల ఎంపిక పనిలో ఉన్నాడు నాగ్ అశ్విన్.

సినిమాలో ప్రభాస్ కి జోడీగా ఎవరైనా బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అలియా భట్ పేరు లిస్టులో ఉందని టాక్. ఒక వేళ అదే నిజమైతే RRR తర్వాత అలియాకి ఇది రెండో తెలుగు సినిమా అవుతుంది.

ప్రభాస్ మూవీని పాన్-ఇండియన్ సినిమా రేంజ్ దాటి, పాన్-వరల్డ్ సినిమాగా తీయబోతున్నట్టు నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించాడు. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో యూనివర్సల్ అప్పీల్ తో ఈ సినిమా రాబోతోంది. ఇలాంటి ప్రాజెక్టులోకి బాలీవుడ్ భామను తీసుకుంటే రీచ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే అలియా భట్ పేరు తెరపైకొచ్చింది.