The Ghost రిలీజ్ ట్రైలర్ తో నాగ్ హంగామా

Friday,September 30,2022 - 07:14 by Z_CLU

Nagarjuna’s ‘The Ghost’ Release trailer out

కింగ్ నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల ‘ది ఘోస్ట్’ విడుదల తేది దగ్గరపడటంతో చిత్ర నిర్మాతలు ప్రమోషన్ల జోరు పెంచారు. థియేట్రికల్ ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేశార. థియేట్రికల్ ట్రైలర్ లాగానే రిలీజ్ ట్రైలర్ కూడా యాక్షన్ తో పాటు అన్ని కమర్షియల్ హంగులతో ఆకట్టుకుంది.

ది ఘోస్ట్‌గా నాగార్జున పాత్రకు బిగినింగ్ యాక్షన్ బ్లాక్ హైవోల్టేజ్ ఎలివేషన్ ఇస్తుంది. ”డబ్బు, సక్సెస్ ఆనందం కంటే శత్రువులను ఎక్కువ తెస్తుంది” అని నాగార్జున చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇందులో నాగార్జునకి చాలా మంది శత్రువులు ఉన్నారు. అండర్ వరల్డ్ నుండి అతని సోదరి కుటుంబాన్ని రక్షించే బాధ్యతను తీసుకోవడంతో శత్రువుల జాబితా మరింత పెరుగుతుంది.

ట్రైలర్ లో నాగార్జున హైలీ ఇంటెన్స్ గా కనిపించి డెడ్లీ స్టంట్స్ లో ఆశ్చర్యపరిచారు. స్టైలిష్ ,యాక్షన్ థ్రిల్లర్‌లను డీల్ చేయడంలో స్పెషలిస్టయిన ప్రవీణ్ సత్తారు యాక్షన్ సినిమా ప్రేమికులకు ది ఘోస్ట్ ని ఫుల్ మీల్ ఫీస్ట్ గా తీర్చిదిద్దారు. అలాగే ఇందులో ఫ్యామిలీ, యూత్ ఎలిమెంట్స్ కూడా వున్నాయి. నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్ గా కనిపించారు. నాగార్జున సోదరిగా గుల్ పనాగ్, మేనకోడలుగా అనిఖా సురేంద్రన్ పాత్రలు కూడా ఆసక్తికరంగా వున్నాయి. రిలీజ్ ట్రైలర్ తో ‘ది ఘోస్ట్’ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుంది. తాజాగా ఆన్లైన్ లో సినిమా బుకింగ్స్ ఓపెన్ చేశారు. మరి మొదటి రోజు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.