

Tuesday,September 21,2021 - 01:00 by Z_CLU
అక్కినేని నాగేశ్వర రావు జయంతి సందర్భంగా కింగ్ నాగార్జున ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఇక తెలుగు ప్రజల గుండెల్లో దసరా బుల్లోడుగా స్థానం సంపాదించుకున్న ఏఎన్నార్ ఆ సినిమాలో పంచెకట్టుతో కనిపించి మెప్పించారు. నాటి ఏఎన్నార్ గారి రూపాన్ని నాగార్జున రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన అంటూ అచ్చ తెలుగు, పంచెకట్టులో మెరిశారు నాగార్జున. ఆ సినిమాలో బంగార్రాజు పాత్రకు ఎంతటి ఆదరణ దక్కిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ లో నాగార్జున బంగార్రాజుగా నటిస్తున్నారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావును గుర్తుకు తెచ్చేలా బంగార్రాజు పాత్రను డిజైన్ చేశారు. ఈ మేరకు ఆయన జయంతి సందర్భంగా సినిమాలోని ఆయన పాత్ర, ఆ క్యారెక్టర్ లుక్‌కు సంబంధించిన విశేషాలు నాగార్జున వివరించారు.
కుటుంబ సభ్యులందరితో కలిసి చూసేలా బంగార్రాజును అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ రూపొందిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. నాగార్జున నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తుండగా, సత్యానంద్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రాఫర్.
తారాగణం: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ మరియు జాన్సీ
సాంకేతిక వర్గం:
కథ, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల
నిర్మాత: అక్కినేని నాగార్జున
బ్యానర్లు: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
స్క్రీన్ ప్లే: సత్యానంద్
సంగీతం: అనూప్ రూబెన్స్
DOP: యువరాజ్
ఆర్ట్: బ్రహ్మ కడలి
PRO: వంశీ-శేఖర్
Thursday,August 24,2023 07:36 by Z_CLU
Tuesday,August 22,2023 12:43 by Z_CLU
Friday,August 18,2023 03:55 by Z_CLU
Friday,August 18,2023 10:06 by Z_CLU