బాంబ్ పేల్చిన నాగార్జున

Tuesday,November 29,2016 - 10:01 by Z_CLU

ఓ సినిమా కంప్లీట్ అయిన వెంటనే మరో సినిమా స్టార్ట్ చేయడం నాగ్ స్టయిల్. ఇప్పుడు కూడా అదే చేశాడు. ఓం నమో వేంకటేశాయ షూటింగ్ కంప్లీట్ అయింది కాబట్టే… రాజుగారి గది-2 సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. కానీ సేమ్ టైం, ఓం నమో వేంకటేశాయ సినిమాకు సంబంధించి బాంబ్ పేల్చాడు నాగ్. ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తనకే తెలియదంటున్నాడు.
nag-1
రాజుగారి గది-2 లాంఛింగ్ సమయంలో మీడియాతో మాట్లాడుతూ… “ఓం నమో వెంకటేశాయ ఫిబ్రవరిలో కూడా విడుదలవుతుందని నేననుకోను. చాలా విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పుడు మన బాహుబలి లాంటి సినిమాలన్నీ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఒక స్టాండర్ట్ సెట్ చేశాయి. వాటితో పోల్చిచూస్తారు కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాం. అంతా అయిపోయాక, నాకు నచ్చితేనే సినిమా బయటకు వస్తుంది. ఈ విషయంలో రాజీ పడట్లేదు కాబట్టే రిలీజ్ ఎప్పుడదనేది చెప్పలేకపోతున్నా.” అని అన్నారు.