చరణ్ సినిమాకి దూరంగా చిరు

Tuesday,November 29,2016 - 11:54 by Z_CLU

రామ్ చరణ్ సినిమాలో చిరు ఇన్వాల్వ్ కంపల్సరీ, స్టోరీ డిస్కషన్స్ స్టార్ట్ అయిన దగ్గరి నుండి సినిమాకి శుభం కార్డు వరకు, ప్రమోషన్స్ దగ్గరి నుండి ఆడియో ఫంక్షన్ వరకు మ్యాగ్జిమం అన్ని ఎలిమెంట్స్ లోను చెర్రీతో పాటు యాక్టివ్ గా ఉంటాడు. కానీ ‘ధృవ’ సినిమాలోనే చిరు హల్ చల్ పెద్దగా కనిపించడం లేదు. తన సినిమా‘ఖైదీ నం 150’ సినిమాతో బిజీ అయిన చిరు ‘ధృవ’పై ఫోకస్ తగ్గించినట్టు కనిపిస్తోంది.

చెర్రీ సినిమా ఆడియో ఫంక్షన్ లో హైలెట్ గా నిలిచే చిరు, ఈ సారి ‘ధృవ’ ఆడియో ఫంక్షన్ లోనూ సర్ ప్రైజ్ స్పీచ్ ని  ఎక్స్ పెక్ట్ చేశారు మెగాఫ్యాన్స్. కానీ సినిమా యూనిట్ ఏకంగా ఆడియో ఫంక్షన్ నే అవాయిడ్ చేసింది. పోనీ ధృవలో  చిరు ఎప్పీయరెన్స్ ఉందా అంటే… అది కూడా లేకుండా పోయింది. తన సినిమాల పట్ల డెడికేట్ గా ఉండే చిరు, అంత బిజీ షెడ్యూల్స్ మధ్య ధృవ కి టైం స్పెండ్ చేయడం ఇంపాసిబుల్.

dhruva-dance-making

ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మెగా మైండ్ లో రెయిజ్ అయిన క్వశ్చన్ ఏంటంటే… చిరు కనీసం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అయినా అటెండ్ అవుతాడా..? లేదా సింపుల్ గా ఓ వీడియో క్లిప్ పంపి సైడ్ అయిపోతాడా..? ఈ మెగా పాయింట్ కి ఆన్సర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు తేలిపోతుంది.