ఈ సినిమా నిడివి 2 గం. 12 నిమిషాలే...

Tuesday,November 29,2016 - 09:29 by Z_CLU

ఓ చారిత్రక సినిమా చేస్తుంటే, డ్యూరేషన్ ప్రాబ్లమ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ప్రతి ఒక్క దర్శకుడికి ఎదురయ్యే అనుభవమే ఇది. అందుకే చారిత్రక నేపథ్యంలో తెరకెక్కే సినిమాలన్నీ కనీసం 3 గంటలుంటాయి. లేదంటే, 2 గంటల 45 నిమిషాలైనా ఉంటాయి. కానీ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను మాత్రం కేవలం 2గంటల 12 నిమిషాలకే కుదించగలిగాడు దర్శకుడు క్రిష్. తమ సినిమా అతి తక్కువ సమయంలో ముగుస్తుందని, ఇలా తక్కువ రన్ టైం ఉండడం కూడా సినిమాకు ప్లస్ అవుతుందని క్రిష్ చెబుతున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లోకి ఎఁటరైంది. రీరికార్డింగ్ తో పాటు గ్రాఫిక్ వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ డిసెంబర్ మూడోవారానికి కంప్లీట్ అయిపోతాయి. డిసెంబర్ లో సినిమా సెన్సార్ పూర్తిచేసి, సంక్రాంతి కానుకగా జనవరిలో మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమా ఆడియో వేడుకను డిసెంబర్ 16న తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు.