రాహుల్ డైరెక్షన్ లో నాగార్జున.. మార్చ్ నుండి సెట్స్ పైకి

Tuesday,January 22,2019 - 03:33 by Z_CLU

రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు కింగ్ నాగార్జున. ‘చిలసౌ’ సినిమా చూసి రాహుల్ కి అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమా చాన్స్ ఇస్తానంటూ మాటిచ్చిన నాగ్ ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకుంటున్నాడు. ఈ సినిమాను త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టేజిలో ఉన్న ఈ సినిమా మార్చ్ నుండి సెట్స్ పైకి రానుందని సమాచారం.

ఫన్ & ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేసుకోలేదు మేకర్స్. కానీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై మన్మధుడు 2 టైటిల్ రిజిస్టర్ చేయించారు. బహుశా ఈ సినిమాకు అదే టైటిల్ పెట్టె ఛాన్స్ ఉంది.