ఒకే సారి రెండు సినిమాలు... నితిన్ ప్లాన్ అదే

Tuesday,January 22,2019 - 02:42 by Z_CLU

‘శ్రీనివాస కళ్యాణం’ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న నితిన్ ఎట్టకేలకు రెండు సినిమాలను ఒకే సారి సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. వెంకీ కుడుముల డైరెక్షన్ లో ‘భీష్మ’ అనే సినిమా చేయబోతున్న నితిన్ ఈ సినిమాతో పాటే సూర్య ప్రతాప్ తో చేయబోతున్న సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురావాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించి జెట్ స్పీడ్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

వెంకీ కుడుముల- నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘భీష్మ’ ఫిబ్రవరి చివరికి లేదా మార్చ్ లో సెట్స్ పైకి రానుండగా, నితిన్- సూర్య ప్రతాప్ కాంబో లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కనున్న సినిమా మార్చ్ లో సెట్స్ పైకి రానుంది. ఈ రెండు సినిమాలను ఒకే టైంలో ఫినిష్ చేసి నెలల గ్యాప్ లోనే ఫ్యాన్స్ ని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంటర్టైన్ చేయాలని భావిస్తున్నాడు యూత్ స్టార్.