పెళ్ళి విషయంలో క్లారిటీ ఇచ్చిన నాగశౌర్య

Thursday,February 01,2018 - 10:03 by Z_CLU

రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది నాగశౌర్య ఛలో. ఇప్పటికే ఈ సినిమా యూత్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. అయితే టాలీవుడ్ లో ఈ మూవీ టాక్ తో పాటు నాగశౌర్య, నిహారిక లకు పెళ్ళి అంటూ వస్తున్న న్యూస్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాగశౌర్య ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు నాగశౌర్య.

“నిహారికతో నాకు పెళ్లంటూ వార్తలు వస్తున్నాయి. నాకు ఏ సంబంధం లేదు. వేరే ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారు. నేనే షాక్ లో ఉన్నాను. ఏం జరుగుతుందో చూడాలి. నాకు హీరోయిన్లు ఎవరితో సంబంధం లేదు. నా దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది. మా అమ్మ బలవంతం చేస్తే మరో 3-4 ఏళ్లలో పెళ్లి చేసుకుంటానేమో. అమ్మ చూసిన ఏ అమ్మాయి అయినా నాకు ఓకే.” అని మీడియాలో వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు నాగశౌర్య.

‘ఛలో’ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా ఈ సినిమాకు కెమెరా మెన్ గా పనిచేసిన సాయి శ్రీరామ్ డైరెక్షన్ లో నటించనున్నాడు నాగశౌర్య. ఆ తర్వాత తన సొంత నిర్మాణంలో ‘నర్తనశాల’ అనే సినిమాలో నటించనున్నాడు నాగశౌర్య.