నాగ శౌర్య కోసం బాలీవుడ్ హీరోయిన్ ?

Sunday,September 29,2019 - 03:47 by Z_CLU

ప్రెజెంట్ సొంత బ్యానర్ లో రమణ తేజ అనే దర్శకుడితో సినిమా చేస్తున్న నాగ శౌర్య నెక్స్ట్ లక్ష్మీ సౌజన్య అనే దర్శకురాలితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది. మృణాల్ లేటెస్ట్ గా హృతిక్ ‘సూపర్ 30’ , ‘బాట్ల హౌజ్’ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. శౌర్య సినిమాతో ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది.

సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. సొంత బ్యానర్ లో చేస్తున్న సినిమాకు బ్రేక్ ఇచ్చి ఈ సినిమాను చేయనున్నాడు శౌర్య. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.