మెగా హీరోతో నభా నటేష్ !

Sunday,September 29,2019 - 04:02 by Z_CLU

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ప్రతి రోజు పండగే’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సాయి ధరం తేజ్ నెక్స్ట్ సుబ్బు అనే డెబ్యూ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు లేటెస్ట్ గా నభా నటేష్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసారు మేకర్స్. ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై భోగవల్లి ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా అక్టోబర్ లేదా నవంబర్ లో సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. మిగతా కాస్టింగ్ ను కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కి ప్లాన్ చేస్తున్నారు.