Varudu Kaavalenu - నాగశౌర్య సినిమా రిలీజ్ కు రెడీ

Saturday,October 16,2021 - 12:58 by Z_CLU

Naga Shaurya, Ritu Varma starer Varudu Kaavalenu releasing in October 29

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగశౌర్య, నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం  ‘వరుడు కావలెను‘.

– Varudu Kaavalenu Teaser

ఈ చిత్రం విడుదల తేదీని విజయదశమి సందర్భంగా ప్రకటించారు. అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది వరుడు కావలెను సినిమా. ఈ మేరకు మరో బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు.

– Varudu Kaavalenu Lyrical

ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన ‘‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా’, అలాగే ‘దిగు దిగు నాగ’, ‘‘మనసులోనేనిలిచి పోకె మైమరపుల మధురిమ పాటలు బహుళ ప్రజాదరణ పొందినాయి. దీనికి ముందు ఇప్పటివరకు విడుదల చేసిన చిత్రాలు, ప్రచార చిత్రాలు వంటి వాటికి కూడా ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. సామాజిక మాధ్యమాలలో కూడా వీటికి ప్రాచుర్యం లభించింది.

varudu kaavalenu

ప్రేమ, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో ‘వరుడు కావలెను‘ చిత్రం  మిమ్మల్ని అలరించటానికి మీముందుకు వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29 న విడుదల అవుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్     సమర్పణ: పి.డి.వి.ప్రసాద్

నిర్మాత: సూర్య దేవర నాగవంశి

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics