Sai Dharam Tej - హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తేజ్
Friday,October 15,2021 - 01:26 by Z_CLU
Sai Dharam Tej Recovered and discharged from hospital
రోడ్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఎట్టకేలకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దాదాపు 35 రోజుల పాటు హాస్పిటల్ లో ఉన్న తేజ్, ఈరోజు ఇంటికెళ్లాడు. ఈరోజు సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు. పైగా దసరా. దీంతో మెగా కాంపౌండ్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటోంది.
గతనెల 10న హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ పై యాక్సిడెంట్ కు గురయ్యాడు తేజ్. అతడు డ్రైవ్ చేస్తున్న బైక్ ఇసుకలో స్కిడ్ అవ్వడంతో గాయపడ్డాడు. వెంటనే అతడ్ని దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లి, అట్నుంచి అటు అపోలోకు షిఫ్ట్ చేశారు. ట్రీట్ మెంట్ లో భాగంగా తేజ్ కు కాలర్ బోన్ సర్జరీ చేశారు. ఆ తర్వాత ఫిజియోథెరపీ నిర్వహించారు. ఈ గ్యాప్ లో తేజ్ హెల్త్ కండిషన్ పై వచ్చిన పుకార్లను చిరంజీవి, పవన్ కల్యాణ్, ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు.
సాయితేజ్ హాస్పిటల్ లో ఉన్న టైమ్ లోనే అతడు నటించిన రిపబ్లిక్ సినిమా రిలీజైంది. సమాజానికి మంచి సందేశం ఇస్తూ తెరకెక్కిన ఆ సినిమాలో సాయితేజ్ నటనకు మంచి గుర్తింపు దక్కింది. అంతా సాయితేజ్ యాక్టింగ్ ను అప్రీషియేట్ చేశారు.
సాయితేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విషయాన్ని స్వయంగా పవన్ కల్యాణ్, చిరంజీవి ప్రకటించారు. తేజ్ పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నాడని, అతడి ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు మెగా బ్రదర్స్.

- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics