Most Eligible Bachelor - ఫస్ట్ డే కలెక్షన్

Saturday,October 16,2021 - 02:16 by Z_CLU

ప్రమోషన్ పనికొచ్చింది. పూజా హెగ్డే క్రేజ్ కలిసొచ్చింది. ఫలితంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మొదటి రోజు మెరిసింది. ఈ సినిమాకు ఫస్ట్ డే ఏకంగా 5 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ వచ్చింది. సెకెండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇది.

సెకెండ్ వేవ్ ముగిసింది. థియేటర్లు తెరుచుకున్నాయి. లవ్ స్టోరీ సినిమాతో నాగచైతన్య థియేట్రికల్ మార్కెట్ కు ఓ ఊపు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ ఊపును మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అఖిల్ కొనసాగించాడు. నైజాంలో ఈ సినిమాకు కోటిన్నరకు పైగా షేర్ రాగా.. అటు సీడెడ్ లో కోటి రూపాయలకు పైగా షేర్ సాధించింది.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ మూవీకి మొదటిరోజు 2 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అలా అఖిల్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మొదటి రోజు షేర్
నైజాం – 1.76 కోట్లు
సీడెడ్ – 1.10 కోట్లు
ఈస్ట్ – 30 లక్షలు
వెస్ట్ – 28 లక్షలు
కృష్ణా – 31 లక్షలు
వైజాగ్ – 56 లక్షలు
గుంటూరు – 50 లక్షలు
నెల్లూరు – 23 లక్షలు

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics