ఆ డైరెక్టర్ తో చైతూ సినిమా... కానీ !

Saturday,May 11,2019 - 03:54 by Z_CLU

అక్కినేని నాగ చైతన్య వరుసపెట్టి సినిమాలు ఫైనల్ చేసుకుంటున్నాడు. సినిమా.. సినిమాకు గ్యాప్ లేకుండా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇటివలే ‘మజిలీ’తో సూపర్ హిట్టు కొట్టిన ఈ హీరో ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ‘వెంకీ మామ’ చేస్తున్నాడు.

ఈ సినిమాలో వెంకీతో కలిసి నటిస్తున్నాడు చైతూ. ఈ సినిమా పూర్తవ్వగానే దిల్ రాజు బ్యానర్లో శశి అనే కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు లేటెస్ట్ గా మరో సినిమాను కూడా ఫైనల్ చేసుకున్నాడట చై.

శశి సినిమా తర్వాత ‘ఆర్.ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతితో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. లేటెస్ట్ గా చైతూకి ఓ యాక్షన్ సబ్జెక్ట్ చెప్పాడట అజయ్. చైతూ కి స్క్రిప్ట్ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించే ఛాన్స్ ఉందంటున్నారు. సో అజయ్ భూపతితో చైతూ సినిమా ఫిక్స్.. కానీ కాస్త టైం పడుతుంది.