స్టార్ డైరెక్టర్ తో రవితేజ ఫిక్స్ ?

Saturday,May 11,2019 - 03:02 by Z_CLU

ప్రస్తుతం వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్న రవితేజ నెక్స్ట్  స్టార్ డైరెక్టర్ తో  సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు మాస్ మహారాజా. గతంలో ‘కృష్ణ’తో సూపర్ హిట్ కొట్టిన ఈ కాంబో మరో సినిమాతో రాబోతుంది. లేటెస్ట్ గా రవితేజకి కథ వినిపించి లాక్ చేసుకున్నాడు వినాయక్.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. డిస్కో రాజా షూటింగ్ ఓ కొలిక్కి రాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలపు బుజ్జి ఈ సినిమాను నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.