చైతూ, సమంత మూవీ అప్ డేట్స్

Thursday,November 22,2018 - 01:31 by Z_CLU

రియ‌ల్ లైఫ్ క‌పుల్ నాగ‌చైత‌న్య, స‌మంత నిన్నుకోరి ఫేమ్ శివ‌నిర్వాన ద‌ర్శ‌క‌త్వంలో క‌లిసి న‌టిస్తున్నారు. ఈ ఇద్ద‌రూ న‌టిస్తున్న నాలుగో సినిమా ఇది. ఈ క్రేజీ కాంబినేష‌న్ ను త‌న క‌థ‌తో మ‌రింత క్రేజీగా మార్చేస్తున్నారు ద‌ర్శ‌కుడు శివనిర్వాన‌.

కొన్ని రోజులుగా వైజాగ్ లో జ‌రుగుతున్న షెడ్యూల్ ఇప్పుడు పూర్తైపోయింది. న‌వంబ‌ర్ 26 నుంచి హైద‌రాబాద్ లో కొత్త షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు 40 శాతం షూటింగ్ పూర్తైపోయింది. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామాకు గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. విష్ణు శ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

రేపు నాగచైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రేపు విడుదల చేసే ఛాన్స్ ఉంది. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ లో సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:
నాగ‌చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంశ కౌశిక్, రావు ర‌మేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌ణికెళ్ళ భ‌ర‌ణి, ర‌విప్ర‌కాశ్, క‌ర‌ణ్, రాజ‌శ్రీ నాయ‌ర్

సాంకేతిక విభాగం:
ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాన‌
నిర్మాత‌లు: సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది
నిర్మాణ సంస్థ‌: షైన్ స్క్రీన్స్
సంగీతం: గోపీ సుంద‌ర్
సినిమాటోగ్ర‌ఫీ: విష్ణు శ‌ర్మ
ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్
ఎడిట‌ర్: ప‌్ర‌వీణ్ పూడి
యాక్ష‌న్: వెంక‌ట్
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్