రేపే టాక్సీవాలా సక్సెస్ సంబరాలు

Thursday,November 22,2018 - 01:01 by Z_CLU

రిలీజ్ కు ముందే టోటల్ సినిమా పైరసీ బారినపడింది. అయినప్పటికీ రిజల్ట్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది టాక్సీవాలా యూనిట్. వాళ్ల నమ్మకానికి తగ్గట్టే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ ఏడాది విజయ్ దేవరకొండ కెరీర్ లో మరో హిట్ మూవీగా నిలిచింది. ఎన్నో అడ్డంకులు అధిగమించి, పైరసీని అధిగమించి మరీ ఈ మూవీ హిట్ అవ్వడంతో ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పడానికి రెడీ అయింది యూనిట్. ఇందులో భాగంగా గ్రాండ్ గా సక్సెస్ సంబరాలు నిర్వహించాలని ఫిక్స్ అయింది.

రేపు టాక్సీవాలా సక్సెస్ సంబరాల్ని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. భీమవరంలోని విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ లో ఈ సెలబ్రేషన్స్ ఉంటాయి. హీరోహీరోయిన్లతో పాటు యూనిట్ కు చెందిన కీలకమైన సభ్యులంతా ఈ సంబరాల్లో పాల్గొంటారు. ప్రేక్షకులకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన టాక్సీవాలా సినిమా అన్ని వర్గాల్ని ఎట్రాక్ట్ చేస్తోంది. సెంటిమెంట్, కామెడీ, థ్రిల్, హారర్, సస్పెన్స్, సూపర్ హిట్ సాంగ్స్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండడంతో సినిమాను యూత్ నుంచి పెద్దోళ్ల వరకు అంతా ఎంజాయ్ చేస్తున్నారు.