రెండు సినిమాలతో బిజీ !

Sunday,April 14,2019 - 01:17 by Z_CLU

ప్రస్తుతం ‘మజిలీ’ తో థియేటర్స్ లో సందడి చేస్తున్న నాగ చైతన్య వెంకటేష్ తో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఓ షెడ్యుల్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెండో షెడ్యుల్ జరుపుకోనుంది. ఈ సినిమా తర్వాత శశి అనే డెబ్యూ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు చైతు. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు.

చైతు కోసం మరో ఇద్దరు డైరెక్టర్స్  స్క్రిప్ట్స్ రెడీ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. శశి సినిమా తర్వాత సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమా చేస్తాడు చై. ఆ సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది మాత్రం ఇంకా ఫైనల్ అవ్వలేదు. ప్రస్తుతానికి ‘వెంకీ మామ’, దిల్ రాజు బ్యానర్ సినిమాకు మాత్రమే కమిట్ అయ్యాడు చైతు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టనున్నాడు.