ఆర్.ఆర్.ఆర్ : బాలీవుడ్ బ్యూటీ రెమ్యునరేషన్ ఎంత ?

Sunday,April 14,2019 - 03:02 by Z_CLU

ఎన్టీఆర్ -రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మల్టీ స్టారర్ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ను తీసుకున్న సంగతి తెలిసిందే… సినిమాలో రామ్ చరణ్ కి జోడి గా నటిస్తున్న ఆలియా భట్ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆర్.ఆర్.ఆర్ భారీ బడ్జెట్ సినిమా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో నిర్మాత దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.  ఈ సినిమా కోసం ఆలియా భట్ కి రూ5 కోట్ల రెమ్యునరేషన్ అందించాడట నిర్మాత.

బాలీవుడ్ లో ఆలియా కి మంచి సక్సెస్ రేట్ ఉంది. ఈ అమ్మడు చేసిన కొన్ని సినిమాలు అక్కడ భారీ వసూళ్లు సాధించాయి. తెలుగు ప్రేక్షకులకు కూడా అమ్మడు పరిచయమే. అందుకే ఈ సినిమా కోసం ఏరి కోరి మరీ ఈ బ్యూటిని తీసుకున్నాడు జక్కన్న.