Uppena 1st weekend - కొత్త రికార్డ్

Monday,February 15,2021 - 03:32 by Z_CLU

అంతా ఊహించినట్టుగానే ఉప్పెన సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్-ఈవెన్ సాధించింది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని, 3 రోజుల్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అలా అధికారికంగా ఉప్పెన సినిమా, 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అందుకొని రికార్డ్ సృష్టించింది.

కొత్త నటీనటులు, కొత్త దర్శకుడితో, మొదటి వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా ఉప్పెన చరిత్ర సృష్టించింది. ఈ సినిమాతో ఇన్నాళ్లూ థియేట్రికల్ బిజినెస్ పై ఉన్న అనుమానాలు కూడా పటాపంచలయ్యాయి. కరోనా తర్వాత థియేటర్లకు ఆడియన్స్ రారేమో అనే భ్రమను ఉప్పెన తొలిగించింది.

పాటలతో వచ్చిన హైప్ ను, వంద శాతం ఆక్యుపెన్సీ వెసులుబాటును ఈ సినిమా పూర్తిగా క్యాష్ చేసుకుంది. అందుకే మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ ఉప్పెనంత వసూళ్లు వచ్చాయి.

వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమైన ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు కూడా దర్శకుడిగా పరిచయమయ్యాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సూపర్ హిట్ ట్యూన్స్ అందించాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దర్శకుడు బుచ్చిబాబుకు, ఈ బర్త్ డే కలకాలం గుర్తుండిపోతుండి.

Uppena 1st weekend (3 Days) Collections
నైజాం – 8.53
ఉత్తరాంధ్ర – 4.12
ఈస్ట్ – 2.36
వెస్ట్ – 1.53
కృష్ణా – 1.76
గుంటూరు – 2.07
నెల్లూరు – 86.4 లక్షలు
సీడెడ్ – 3.7