బాలయ్య డిసైడ్ అయ్యాడు.

Sunday,July 08,2018 - 11:16 by Z_CLU

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తండ్రి ఆత్మ కథతో ‘NTR’అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… ఈ సినిమాకు సంబంధించి ఇటివలే షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసాడు బాలయ్య. క్రిష్ డైరెక్షన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోక్షజ్ఞ బాలకృష్ణ క్యారెక్టర్ చేయనున్నాడనే వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ప్రస్తుతం అందిన సమాచారం మేరకూ NTR సినిమాలో మోక్షజ్ఞ నటించడం లేదని తెలుస్తుంది. ఇటివలే తన సన్నిహితులతో మాట్లాడుతూ మోక్షజ్ఞ సినిమాలో లేడన్న విషయంపై బాలయ్య క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం యాక్టింగ్ కి సంబంధించి ట్రైనింగ్ తీసుకుంటున్న మోక్షజ్ఞ ను వచ్చే ఏడాది గ్రాండ్ గా లాంచ్ చేయాలనీ చూస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొందరు దర్శకులతో కూడా చర్చిస్తున్నాడని తెలుస్తుంది. ఈ టైం స్పెషల్ రోల్ వద్దనుకుంటున్నాడట బాలయ్య.  సో NTR లో మోక్షజ్ఞ నటిస్తున్నాడనే వార్తపై  క్లారిటీ వచ్చేసినట్టే.