స్పీడ్ పెంచిన మెగా హీరోయిన్

Sunday,July 08,2018 - 12:03 by Z_CLU

నాగ శౌర్య హీరోగా నటించిన ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది మెగా హీరోయిన్ నిహారిక… ‘ఒక మనసు’ తర్వాత ‘ఒరు నల్లా నాల్ పాత్రు సోల్రే’ అనే సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం మళ్ళీ తెలుగులో వరుస సినిమాలతో స్పీడ్ పెంచేసింది. లేటెస్ట్ గా ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమాలో నటించిన మెగా హీరోయిన్ ప్రస్తుతం రాహుల్ విజయ్ హీరోతో సినిమాలో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే లేటెస్ట్ గా మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తుంది.

వరుస సినిమాలతో టాలీవుడ్ లో హీరోయిన్ గా తన సత్తా చాటాలని భావిస్తున్న నిహారిక తన క్యారెక్టర్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటుందని సమాచారం. మరి ఈ సినిమాలతో నిహారిక ఎలాంటి విజయాలు అందుకుంటుందో..చూడాలి.