ట్రైనింగ్ తీసుకోబోతున్న నాని

Sunday,July 08,2018 - 10:01 by Z_CLU

ప్రస్తుతం నాగార్జున తో కలిసి ‘దేవదాస్’ సినిమాలో నటిస్తున్న నాని మరో వైపు తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలెట్టేసాడు. ‘మళ్ళీ రావా’ ఫేం గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో క్రికెట్ బేస్డ్ మీద ‘జెర్సీ’ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా క్రికెట్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు. ఆగస్ట్ నుండి దాదాపు నెల రోజుల పాటు క్రికెట్ లో ట్రైనింగ్ తీసుకొని సెప్టెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడు నేచురల్ స్టార్.

స్పోర్ట్స్ బేస్డ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్రికెట్ ని ఆరాదించే యువ క్రికెటర్ గా కనిపించబోతున్నాడు నాని. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది.