సూర్య తో మోహన్ బాబు... ఇది రెండో సినిమా !

Sunday,June 16,2019 - 11:06 by Z_CLU

విలన్ గా , హీరోగా ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మెప్పించిన మంచు మోహన్ బాబు నెక్స్ట్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ‘సూరరై పోట్రు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ ఇటివలే ప్రకటించారు. సూర్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘గురు’ ఫేం సుధా కొంగర దర్శకురాలు.

అయితే మోహన్ బాబు లేడీ డైరెక్టర్ తో సినిమా చేయడం ఇది రెండో సారి… గతంలో కృష్ణ హీరోగా విజయ నిర్మల డైరెక్షన్ లో ఓ సినిమాలో విలన్ గా నటించిన మోహన్ బాబు మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత సుధా డైరెక్టర్ లో పనిచేస్తుండడం విశేషం.

కథలో కీలకమైన క్యారెక్టర్ కావడంతో మోహన్‌బాబు యాప్ట్‌ అని అప్రోచ్ అయ్యారు మేకర్స్. కథ, పాత్ర నచ్చడంతో మోహన్ బాబు కూడా వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేస్తోంది యూనిట్.