షూటింగ్ అప్ డేట్స్

Sunday,June 16,2019 - 12:09 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి  నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ కోకాపేట్ లో జరుగుతుంది. ఇటివలే పాండిచెర్రిలో మూడు రోజుల పాటు షూట్ చేసిన యూనిట్ ప్రస్తుతం కోకాపేట్ లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. మరో వారం పాటు  జరగనున్న షూటింగ్ తో  టోటల్ షూటింగ్ పూర్తి కానుంది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు.

ప్రభాస్ ‘సాహో’ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. ఇటివలే అన్నపూర్ణ స్టూడియోస్ లో సాంగ్ షూట్ చేసారు. రామోజీ ఫిలిం సిటీ షూట్ తర్వాత యూనిట్ యూరప్ వెళ్ళనుంది. యూరప్ లో జరగనున్న షెడ్యుల్ తో టోటల్ షూట్ కంప్లీట్ అవుతుంది. యూ.వి.క్రియేషన్స్ బ్యానర్ పై స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను ఆగస్ట్ 15 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

పూరి జగన్నాథ్,  రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సాంగ్ షూట్ జరుపుకుంటుంది.  మాల్దీవుల్లో పాటను తెరకెక్కిస్తున్నారు. పూరి , ఛార్మీ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నతేష్ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఈ సినిమా జులై12 న థియేటర్స్ లోకి రానుంది.

రానా , సాయి పల్లవి జంటగా  నటించనున్న ‘విరాటపర్వం’ షూట్ జూన్ 22 నుండి వరంగల్ లో మొదలు కానుంది. దాదాపు 15 రోజుల పాటు షెడ్యుల్ ప్లాన్ చేసారు. సురేష్ ప్రొడక్షన్స్ , ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకుడు.

నాని హీరోగా, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమా షూటింగ్ ఈ నెల 17 నుంచి ఢిల్లీ లో జరుగనుంది. కార్తికేయ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఆగస్టు 30న సినిమా రిలీజ్ కానుంది.