అటు సినిమా... ఇటు పెళ్లి....

Wednesday,December 07,2016 - 05:02 by Z_CLU

అఖిల్.. ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్. అతిచిన్న వయసులోనే పెళ్లికి రెడీ అయిపోయి అందర్నీ షాక్ కు గురిచేసిన సిసింద్రీ… మరోవైపు రెండో సినిమాతో కూడా టాక్ ఆఫ్ ది టాాలీవుడ్ గా మారాడు. ఎల్లుండి అఖిల్ ఎంగేజ్ మెంట్ జరగబోతోంది. ప్రేయసి శ్రియా భూపాాల్ తో జరగనున్న ఈ నిశ్చితార్థ వేడుకకు జీవీకే హౌజ్ లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంగేజ్ మెంట్ లో ఎలా కనిపించాలి, ఏ డ్రెస్సులు వేసుకోవాలనే విషయంపై ఇప్పటికే డిజైనింగ్ మొత్తం పూర్తిచేశాాడు అఖిల్. మరోవైపు తన రెండో సినిమా పనుల్ని కూడా పరుగులు పెట్టిస్తున్నాడు.

akhil

రెండో సినిమా కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసినందుకు ఫలితం దక్కిందని ట్వీట్ చేశాడు అఖిల్. ఇన్నాళ్లు వెయిట్ చేసినందుకు, అదిరిపోయే స్టఫ్ తో విక్రమ్ కుమార్ రెడీ అయ్యాడని… ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అఖిల్ ప్రకటించాడు. త్వరలోనే రెండో సినిమా డీటెయిల్స్ వెల్లడిస్తానంటున్నాడు అక్కినేని సిసింద్రీ.