కాబోయే భర్త ఫొటోను షేర్ చేసిన మెహ్రీన్

Tuesday,March 09,2021 - 12:52 by Z_CLU

మెహ్రీన్ కు పెళ్లి సెట్ అయిన సంగతి తెలిసిందే. హర్యానాకు చెందిన కాంగ్రెస్ లీడర్ భవ్య బిష్ణయ్ ను ఆమె వివాహం చేసుకోబోతోంది. మరో 3 రోజుల్లో (మార్చి 12న) వీళ్ల ఎంగేజ్ మెంట్ కూడా ఉంది.

ఈ గ్యాప్ లో కాబోయే భర్త భవ్యతో మెహ్రీన్ ఓ ఫొటో దిగింది. ఆ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎంగేజ్ మెంట్ తో పాటు పెళ్లి కోసం కాస్ట్యూమ్ డిజైనింగ్ ట్రయల్స్ పెట్టింది ఈ జంట. రకరకాల దుస్తులు ధరించి కాంబినేషన్స్ ట్రై చేశారు. అలా దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టింది మెహ్రీన్.

భవ్యను పెళ్లాడబోతున్న విషయాన్ని గత నెల వాలంటైన్స్ డే టైమ్ లోనే బయటపెట్టింది మెహ్రీన్. ఆ టైమ్ లో విడుదలచేసిన కొన్ని ఫొటోలకు అదనంగా ఇప్పుడీ లేటెస్ట్ స్టిల్ రిలీజైంది.

ప్రస్తుతం ఎఫ్3 సినిమా చేస్తోంది మెహ్రీన్. అది రిలీజైన వెంటనే మెహ్రీన్-భవ్య పెళ్లి ఉంటుంది.