F3 ఫస్ట్ డే కలెక్షన్స్ డీటెయిల్స్

Saturday,May 28,2022 - 12:31 by Z_CLU

Venkatesh, Varun Tej’s’F3′ Day1 Collects details

విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫన్   ఫ్రాంచైజీ ‘F3’ నిన్న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. వెంకీ , వరుణ్ అండ్ మిగతా పాత్రలతో అనిల్ రావిపూడి వడ్డించిన కామెడీ విందుకి ప్రేక్షకులు థియేటర్స్ లో హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

ముఖ్యంగా అనిల్ డిజైన్ చేసిన కొన్ని ఎలిమెంట్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఈ కామెడీ సినిమా చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకు పైగా షేర్ సాధించిన F3 ఈ వీకెండ్ మంచి రెవెన్యూ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

F3 First Day AP/TS Share 

Nizam 4.06 Cr
UA 1.18 Cr
Guntur 88 L
Nellore 62 L
East 76 L
West 94 L
Krishna 67 L
Ceded – 1.26 Cr

Total 1st Day AP/TS share : 10.37Cr

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics