Mahesh-Anil Ravipudi - కాంబో రిపీట్స్

Tuesday,March 09,2021 - 12:58 by Z_CLU

సరిలేరు నీకెవ్వరు సినిమాతో అనీల్ రావిపూడి టాలెంట్ ఏంటో మహేష్ కు పూర్తిగా తెలిసింది. మరీ ముఖ్యంగా ఫాస్ట్ గా, క్వాలిటీ తగ్గకుండా మూవీ కంప్లీట్ చేయడంలో అనీల్ రావిపూడి టాలెంట్ ను మహేష్ గుర్తించాడు. అందుకే ఇప్పుడు మరో ఛాన్స్ ఇస్తున్నాడు.

అవును.. ప్రస్తుతం చేస్తున్న సర్కారువారి పాట సినిమా పూర్తయిన వెంటనే అనీల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీళ్లిద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయి. అక్టోబర్ లేదా నవంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.

సర్కారువారి పాట సినిమాను జస్ట్ ఐదున్నర నెలల్లో పూర్తిచేశాడు అనీల్ రావిపూడి. వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న రెండో మూవీ కూడా రికార్డ్ షార్ట్ టైమ్ లో పూర్తికానుంది.

లెక్కప్రకారం.. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఓ మూవీ చేయాలి. కానీ ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి ఇంకాస్త టైమ్ తీసుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఈ గ్యాప్ లో అనీల్ రావిపూడితో మరో సినిమా చేయడానికి మహేష్ ఒప్పుకున్నాడు.