మెహ్రీన్ ఇంటర్వ్యూ

Friday,September 27,2019 - 01:22 by Z_CLU

లేటెస్ట్ గా ‘F2’లో హనీ గా అలరించిన మెహ్రీన్ ఇప్పుడు చాణక్య లో ఐశ్వర్యగా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5 న విడుదలవుతున్న సందర్భంగా మెహ్రీన్ మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు మెహ్రీన్ మాటల్లోనే.

క్యారెక్టర్ లో ఫన్ ఉంటుంది

‘చాణక్య’ స్పై థ్రిల్లర్ మూవీ. సినిమాలో నేను ఐశ్వర్య అనే క్యారెక్టర్ ప్లే చేసాను. నా క్యారెక్టర్ లో ట్విస్టులుండవు. హీరో క్యారెక్టర్ కి ఓ ట్విస్ట్ ఉంటుంది. అదేంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

అలీ  , సునీల్ తో

ఈ సినిమాలో ఫస్ట్ కమెడియన్స్ అలీ , సునీల్ తో నటించాను. వాళ్ళిద్దరి కామెడీ షూటింగ్ టైం లో బాగా ఎంజాయ్ చేసాను. వాళ్ళ క్యారెక్టర్స్ , అలాగే నా క్యారెక్టర్ లో ఫన్ ఉంటుంది. అది అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.

ఈ జోనర్ కష్టమే

నిజానికి స్పై థ్రిల్లర్ సినిమాను డైరెక్ట్ చేయడం చాలా కష్టం. ఆడియన్స్ ను ఎప్పటికప్పుడు థ్రిల్ చేస్తూ ఎంగేజ్ చేయగలగాలి. ఆ విషయంలో డైరెక్టర్ తిరు సార్ కి మంచి మార్కులు పడతాయి. ప్రతీ సన్నివేశాన్ని ఎంతో క్లారిటీతో తెరకెక్కించారు. కథపై ఆయనకున్న క్లారిటీతోనే సినిమా బాగా వచ్చింది. షూటింగ్ టైంలో కూడా ఆయనకేం కావాలో తెలుసు కనుక మా దగ్గర నుండి పర్ఫెక్ట్ అవుట్ పుట్ తీసుకున్నారు. ఎక్కడా టైం వేస్ట్ చేయలేదు.

గోపీచంద్ తో రెండో సారి

గోపీచంద్ తో ఇది సెకండ్ ఫిలిం. ‘పంతం’ సినిమా తర్వాత మళ్ళీ ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. షూటింగ్ లో ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. షూటింగ్ అయ్యాక చాలా కాంగా ఉంటారు. పక్కన కూర్చొని ఆయన పని ఆయన చేసుకుంటారు. సినిమాలో రామకృష్ణ , విజయ్ గా అందరినీ మెప్పిస్తాడు.

అన్ని రసాలు ఉంటాయి

స్పై థ్రిల్లర్ సినిమా అని కేవలం థ్రిల్లింగ్ ఎలిమెంట్సే కాదు అన్ని రసాలు ఉంటాయి. ఎంటర్టైన్ మెంట్ , రొమాన్స్ , యాక్షన్ ఇలా అన్నీ ఉంటాయి. సో ఇదొక పవర్ పాక్డ్ స్పై థ్రిల్లర్ అని చెప్పొచ్చు.

మళ్ళీ 11 వ సినిమాతో

అనిల్ గారి ప్రొడక్షన్ లో మళ్ళీ నటించడం హ్యాపీ గా ఉంది. 14 రీల్స్ లోనే మొదటి సినిమా ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ చేసాను. మళ్ళీ ఇప్పుడు నా 11వ సినిమా అనీల్ గారి బ్యానర్ లో చేయడం ఎగ్జైటింగ్ గా అనిపించింది. అనీల్ గారు మంచి అభిరుచి గల నిర్మాత. ఈ సినిమాతో ఆయన మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను.

లైఫ్ అంటేనే కష్టాలు

నా కెరీర్ స్టార్టింగ్ బాగానే ఉన్నా మధ్యలో కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. ఇక లైఫ్ అంటే కష్టాలు కామనే కదా. సో జరిగిన దాని గురించి లైట్ తీసుకొని జరగబోయేది ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం అలవాటు చేసుకున్నాను.

హనీ బాగా క్లిక్ అయింది

‘F2’ లో హనీ క్యారెక్టర్ బాగా క్లిక్ అయింది. ఎక్కడికెళ్ళినా హనీ అనే పిలుస్తున్నారు. అందులో నా మేనరిజం కూడా అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమాకు సంబంధించి నా క్యారెక్టర్ క్లిక్ అవ్వడానికి కారణం డైరెక్టర్ అనీల్ గారే.

తెలుగుకే మొదటి ప్రాముఖ్యత 

హీరోయిన్ గా ఎన్ని భాషల్లో సినిమా చేసినా నా మొదటి ప్రాముఖ్యత మాత్రం తెలుగుకే. తెలుగు సినిమా అంటే నాకు అమ్మతో సమానం. ఎంత బిజీ అయినా తెలుగు సినిమాను వదులుకోను. ప్రస్తుతానికి నా ఫోకస్ తెలుగు సినిమాలే.

 

తెలుగులో రెండు పంజాబీ లో ఒకటి

ప్రస్తుతం తెలుగులో ‘ఎంత మంచి వాడవురా’, ‘అశ్వద్దామ’ సినిమాలు చేస్తున్నాను. పంజాబీలో నా మొదటి సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. అది కాకుండా ఇంకో సినిమా చేస్తున్నాను.