డ్రీమ్ గర్ల్ రీమేక్ లో రాజ్ తరుణ్

Friday,September 27,2019 - 04:03 by Z_CLU

ఇప్పటికే అంధాదున్, బధాయి హో వంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో నటించిన ఆయుష్మాన్ ఖురానా… రీసెంట్ గా డ్రీమ్ గర్ల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఎంతగా అంటే 30 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు 4 రోజుల్లోనే 50 కోట్లు వచ్చాయి. ఈనెల 13న రిలీజైన ఈ సినిమాకు ఇప్పటివరకు వరల్డ్ వైడ్ 155 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

ఇప్పుడీ సూపర్ హిట్ మూవీ టాలీవుడ్ ను కూడా ఎట్రాక్ట్ చేసింది. అంధాదూన్, బధాయి హో సినిమాలు ఇప్పటికే తెలుగులోకి రావడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు డ్రీమ్ గర్ల్ కూడా రాబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా రీమేక్ లో రాజ్ తరుణ్ నటించే ఛాన్స్ ఉంది.

డ్రీమ్ గర్ల్ సినిమాలో అమ్మాయిగా నటించాడు ఆయుష్మాన్ ఖురానా. ఓ కాల్ సెంటర్ లో లేడీ వాయిస్ తో మాట్లాడే జాబ్ సంపాదిస్తాడు. అక్కడ్నుంచి అతడి జీవితం ఎలా మారిందనేది సినిమా. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగే ఈ సినిమా రీమేక్ లో రాజ్ తరుణ్ నటిస్తే బాగుంటుందని భావిస్తున్నారు నిర్మాత సురేష్ బాబు. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను సురేష్ బాబు దక్కించుకునే ఆలోచనలో ఉన్నారు.