గద్దలకొండ గణేష్ ఫస్ట్ వీక్ కలెక్షన్

Friday,September 27,2019 - 12:46 by Z_CLU

వాల్మీకి/గద్దలకొండ గణేష్ ఫస్ట్ వీక్ పూర్తిచేసుకుంది. వారం రోజుల్లోనే బ్రేక్-ఈవెన్ కు దగ్గరైంది ఈ సినిమా. నిజానికి మేకర్స్ మొదటి 7 రోజుల్లోనే బ్రేక్-ఈవెన్ ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ భారీ వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఆక్యుపెన్సీ తగ్గింది.

వరుణ్ తేజ్ సినిమాకు మరో 5 రోజులు మాత్రమే టైమ్ ఉంది. ఎందుకంటే అవతలి వారం సైరా సినిమా థియేటర్లలోకి వస్తోంది. మెగాస్టార్ నటించిన ఆ సినిమా మార్కెట్లోకి వస్తే మిగతా సినిమాలకు వసూళ్లు ఇక ఉండవు. అందుకే మిగిలిన ఈ 5 రోజుల్లో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ అవుతుందా అవ్వదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

వరల్డ్ వైడ్ ఈ సినిమాను 25 కోట్ల రూపాయలకు అమ్మారు. మొదటి వారం ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. మిగిలిన ఈ 5 రోజుల్లో మరో 5 కోట్లు రావాలి. మరీ ముఖ్యంగా ఈ వీకెండ్ ఈ సినిమా బాగా పెర్ఫార్మ్ చేయాలి. అప్పుడు మాత్రమే బ్రేక్-ఈవెన్ సాధ్యం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఈ 7 రోజుల్లో 17 కోట్ల 27 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాం ఫస్ట్ వీక్ షేర్స్
నైజాం – రూ. 6.15 కోట్లు
సీడెడ్ – రూ. 2.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.10 కోట్లు
ఈస్ట్ – రూ. 1.25 కోట్లు
వెస్ట్ – రూ. 1.22 కోట్లు
గుంటూరు – రూ. 1.49 కోట్లు
నెల్లూరు – రూ. 0.73 కోట్లు
కృష్ణా – రూ. 1.28 కోట్లు