మెగాస్టార్ ‘సైరా’ సెకండ్ షెడ్యూల్ డీటేల్స్

Friday,March 16,2018 - 01:16 by Z_CLU

మెగాస్టార్ 151 వ మూవీ ‘సైరా’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ‘సైరా’ సినిమా యూనిట్, ప్రస్తుతం సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎలిమెంట్స్ తో పాటు, మరికొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది.

ఇక ఈ నెల 23 నుండి అమితాబ్ బచ్చన్ తో పాటు, నయనతార షూటింగ్ లో పాల్గొననున్నారు. చిరంజీవి 2 డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించనున్న ఈ సినిమా, స్వాతంత్ర సమరయోధుడు నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది.

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుదీప్ తో పాటు విజయ్ సేతుపతి కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటించనున్నారు. జగపతి బాబు విలన్ గా నటిస్తున్న ‘సైరా’ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.