నాగచైతన్య ‘సవ్యసాచి’ ఫస్ట్ పంచ్ అదిరింది

Friday,March 16,2018 - 12:07 by Z_CLU

నాగచైతన్య ‘సవ్యసాచి’ ఫస్ట్ లుక్ రిలీజయింది. ఫస్ట్ పంచ్ పేరిట రిలీజైన ఈ పోస్టర్ సినిమాపై క్యూరాసిటీ జెనెరేట్ చేస్తుంది. దానికి తోడు నాగ చైతన్య ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ కన్నా ముందే, సినిమాలో తన క్యారెక్టర్ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడీ పోస్టర్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది.

‘రెండు చేతులను శక్తివంతంగా వాడే వాళ్ళను సవ్యసాచి అంటారు’ అని నిన్న ట్వీట్ చేసిన నాగచైతన్య, తన క్యారెక్టర్ మహాభారతంలోని అర్జునుడిలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని చెప్పుకున్నాడు. దానికి తోడు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగచైతన్య చుట్టూ చేతులు ఉండటం, వాటిపై సింబల్స్ ఉండటం గమనిస్తే, ఈ సినిమాలో తన 2 చేతులను ఎఫెక్టివ్ గా వాడగలిగే స్పెషల్ క్వాలిటీ ఉన్న యువకుడిలా కనిపించనున్నాడని తెలిసిపోతుంది.

ప్రేమమ్ లాంటి మెలోడియస్ లవ్ ఎంటర్ టైనర్ తరవాత చందూ మొండేటి డైరెక్షన్ లో వస్తున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో మాధవన్, భూమిక కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. నిధి అగర్వాల్  ఈ సినిమాలో  హీరోయిన్  గా  నటిస్తుంది.   M.M. కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని జూన్ 14 న రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.