‘నీదీ నాది ఒకే కథ’ ట్రైలర్ ఇంప్రెస్ చేస్తుంది

Friday,March 16,2018 - 04:33 by Z_CLU

శ్రీ విష్ణు ‘నీదీ నాదీ ఒకే కథ’ ట్రైలర్ రిలీజయింది. యూత్ ఫుల్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీవిష్ణు సరికొత్తగా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. సెల్ఫ్ ఎస్టీమ్, లైఫంటే క్లారిటీ లేని ఒక కన్ఫ్యూజ్డ్ యువకుడి క్యారెక్టర్ లో శ్రీవిష్ణు న్యాచురల్ లుక్స్ లో ఎట్రాక్ట్ చేస్తున్నాడు.

2: 25 నిమిషాల ట్రైలర్ లో 1: 20 నిమిషాలు సినిమాలోని కామెడీ, రొమాంటిక్ ఆంగిల్ ని రివీల్ చేస్తే, లాస్ట్ 1 మినిట్ సినిమాలోని మోస్ట్ ఇంటెన్సివ్ ఇమోషన్ ని ప్రెజెంట్ చేస్తుంది. లైఫ్ లో ఏం చేయాలో క్లారిటీ లేని యువకుడు, చివరికి తన నాన్నకు నచ్చినట్టుగా ఉంటే చాలు అనే పాయింట్ కి రీచ్ అవ్వడం, లైఫ్ లో సెటిల్ అవ్వడం, దానికోసం మనిషి ఇంతలా తపన పడటం అవసరమా..? లాంటి పాయింట్స్ హైలెట్ కానున్న ఈ సినిమాకి ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది.

వేణు ఉడుగుల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాట్నా టైటస్ హీరోయిన్ గా నటించింది. ప్రశాంతి, కృష్ణ విజయ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కంపోజర్.