ఈ ట్రెండ్ పేరు త్రివిక్రమ్

Saturday,October 22,2016 - 03:12 by Z_CLU

టాలీవుడ్ లో త్రివిక్రమ్ అనేది కేవలం ఓ పేరు మాత్రమే కాదు. ఇట్స్ ఎ బ్రాండ్. అవును.. త్రివిక్రమ్ సినిమాలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అతడి సినిమాలకు హీరోయిజంతో పనిలేదు. భారీతనంతో అస్సలు పనిలేదు. మాటల మాంత్రికుడి డైలాగ్స్ ఉంటే చాలు ఆడియన్స్ పండగ చేసుకుంటారు. అ..ఆ సినిమాతో తెలుగు పరిశ్రమకు తెలుగుదనంలో అ..ఆ..లు నేర్పుతున్నాడు త్రివిక్రమ్. అత్తారింటికి దారేది లాంటి సున్నితమైన కథలతో కూడా ఆల్ టైం రికార్డులు సృష్టించవచ్చని చూపిస్తున్నాడు.

మాటలతో తెలుగుసినిమాను మలుపుతిప్పిన అతికొద్దిమంది దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకడు. త్రివిక్రమ్ సినిమాలకు ఓ స్థాయి ఉంటుంది. అతడి మాటలకు అంతకంటే పెద్ద స్థాయి ఉంటుంది. చాంతాడంత డైలాగులను గుక్కతిప్పుకోకుండా చెప్పే హీరోలకు… అలతి పదాలతో, చిన్నచిన్న వాక్యాలతో డైలాగులు ఇచ్చాడు. తెలుగు సినిమా ట్రెండ్ ను మార్చేశాడు. త్రివిక్రమ్ మాటలు నవ్విస్తాయి. సేమ్ టైం ఏడిపిస్తాయి. ఇంకొన్ని మాటలు ఆలోచింపజేస్తాయి. ఎలాంటి ఫీలింగ్స్ ఇచ్చినప్పటికీ.. అన్నింటినీ కలకాలం గుర్తుంచుకోవాలి అనిపించేలా చేస్తాయి ఆ మాటలు.

trivikram-srinivas-pic-690-07-1465308525-13-1465818494-1

ఆ మాటల్లో విరుపులు, వయ్యారాలు త్రివిక్రమ్ కలానికే సొంతం. అలా కేవలం మాటలతోనే పాపులర్ అయిన త్రివిక్రమ్… తన మెగాఫోన్ టాలెంట్ కూడా చూపించాడు. నువ్వే-నువ్వేతో ప్రారంభమైన త్రివిక్రమ్ దర్శకత్వ ప్రస్థానం తాజాగా అ..ఆ సినిమా వరకు విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. అ..ఆ సినిమాతో నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందించాడు. ఓవర్సీస్ లో అ..ఆ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిందంటే ఆ క్రెడిట్ కచ్చితంగా త్రివిక్రమ్ దే. మనసుకు హత్తుకునే కథతో, ఎలాంటి మాసాలాస్ లేకుండా, హంగు-ఆర్భాటానికి దూరంగా అ.ఆ సినిమాను తీసిన విధానం చూస్తే.. ఎవరైనా త్రివిక్రమ్ ను మెచ్చుకొని తీరతారు. అ..ఆ సినిమాతో తనపై తానే ప్రయోగం చేసుకున్న త్రివిక్రమ్..భవిష్యత్తులో మరిన్ని కథాప్రయోగాలు చేస్తూనే.. కమర్షియల్ హిట్స్ ఇస్తానంటున్నాడు.