151వ సినిమా ఎవరితో...?

Friday,September 23,2016 - 11:00 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి దాదాపు ఎనిమిదేళ్ల తరువాత కథానాయకుడిగా ‘ఖైదీ నెం-150’ రీఎంట్రీ ఇస్తున్నాడు. వినాయక్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చిరు తనయుడు రామ్ చరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. చిరు సరసన కాజల్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. సంక్రాంతి కి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.

ఈ సినిమా సెట్స్ పై ఉండగానే 151 వ సినిమా పై ఫోకస్ పెట్టాడట మెగాస్టార్. దాదాపు నవంబర్, డిసెంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి జనవరి నుండి మరో సినిమాను ప్రారంభించాలని చూస్తున్నాడు. చిరు తదుపరి సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా ఉంటారనే టాక్ వినిపిస్తోంది. 151వ సినిమా కోసం ఈ మెగా ప్రొడ్యూసర్ కథాచర్చలు జరుపుతున్నారని సమాచారం. తాజాగా అల్లు అరవింద్ బోయపాటి కి ఈ సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చారని, సరైనోడు తో తన బ్యానర్ కు గ్రాండ్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడినే చిరు సినిమాకు ఖరారు చేశారనే టాక్… ఫిలిం నగర లో గట్టిగా వినిపిస్తోంది.