స్టార్ హీరోల సరికొత్త ప్లాన్స్

Friday,September 23,2016 - 09:00 by Z_CLU

‘ఇంటగెలిచి రచ్చ గెలవాలి’ అనే సామెత ను ఫాలో అయిపోతున్నారు మన టాప్ స్టార్స్. టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటూ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న మన హీరోలు ప్రస్తుతం రచ్చ గెలిచేందుకు సిద్ధమవుతున్నారు.

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ పై కూడా ఫోకస్ పెడుతూ తమ మార్కెట్ పై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ దర్శకులకు అవకాశాలు ఇస్తూ వారితో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు..

ఈ లిస్ట్ లో ముందున్నాడు సూపర్ స్టార్ మహేష్. మురుగదాస్ దర్శకత్వం లో మహేష్ నటిస్తున్న తాజా చిత్రం తెలుగు తో పాటు తమిళ్ లో కూడా ఒకే సారి తెరకెక్కుతోంది.ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాతో తొలి సారిగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు ప్రిన్స్. ‘శ్రీమంతుడు’ తమిళ్ డబ్బింగ్ తో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ హిట్ అందుకున్న మహేష్ తన తాజా సినిమాతో తొలి సారిగా స్ట్రైట్ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమా కోసం తమిళ్ లో స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పబోతున్నాడట మహేష్.

ఇక తాజాగా కోలీవుడ్ లో స్ట్రైట్ సినిమా తో ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే మాలివుడ్ లో తన డబ్బింగ్ సినిమాలతో మార్కెట్ పెంచుకున్న బన్నీ తాజాగా కోలీవుడ్ పై దృష్టి పెట్టాడు. ఇందుకోసం కోలీవుడ్ లో తన దైన మార్క్ యాక్షన్ సినిమాలతో విజయాలు అందుకున్న లింగుస్వామి ను ఎంచుకున్నాడు. త్వరలో లింగుస్వామి దర్శకత్వం లో నటించబోయే సినిమాను చెన్నై లో అనౌన్స్ చేశాడు బన్నీ. జ్ఞాన వెల్ రాజా నిర్మించనున్న ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ్ లోనూ ఒకే సారి తెరకెక్కనుంది. ఈ సినిమాతో కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు.

ఈ ఇద్దరి తో పాటు ప్రభాస్, ఎన్.టి.ఆర్ కూడా తమ తదుపరి సినిమాలతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇటీవలే ‘బాహుబలి’ డబ్బింగ్ తో ఇంటెర్నేషనల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ త్వరలోనే సుజిత్ దర్శకత్వం లో నటించబోయే సినిమాను తమిళ్ లోనూ ఒకే సారి తెరకెక్కించేందుకు డిసైడ్ అయ్యాడనే టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ బాటలోనే ఎన్.టి.ఆర్ కూడా తన తదుపరి సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తన ఇమేజ్ పెంచుకునేందుకు సిద్దమవుతున్నాడట.

ఇలా మన టాలీవుడ్ టాప్ స్టార్స్ సరి కొత్త బాట లో నడుస్తూ ‘కొత్త బంగారు లోకం’ లో అడుగులేస్తున్నారు.