అంత మాట అనేశాడేంటి?

Saturday,September 24,2016 - 09:00 by Z_CLU

బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ తో ఊపుమీదున్న నాని, మజ్నుగా మరోసారి మనముందుకొచ్చాడు. లేటెస్ట్ లవర్ బాయ్ గా నానికి మంచి మార్కులు పడ్డాయి. అయితే మజ్నులో ఎట్రాక్ట్ చేసింది నాని మాత్రమే కాదు. స్పెషల్ రోల్ చేసిన రాజమౌళి… కూడా.  ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో ఎంటర్ టైన్ చేశాడు. సినిమాలో ఏకంగా జక్కన్నపైనే నాని సెటైర్లు వేస్తే… నానిపై కామెడీ పంచ్ లు కురిపించాడు రాజమౌళి. ఇలా వీళ్లిద్దరి కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయింది.

  రాజమౌళి తన ప్రతి సినిమాను చాలా ఆలస్యంగా తెరకెక్కిస్తాడని , ప్రతి సినిమాను దాదాపు 2 ఏళ్ల నుండి 3 ఏళ్ళ పాటు చెక్కుతాడు. ఈ విషయంలో జక్కన్నపైనే సెటైర్లు వేశాడు నాని. మజ్ను సినిమాలో ఈ ఫన్నీ సీన్ ఉంది. ఈ సినిమా క్లయిమాక్స్ లో నాని రాజమౌళి తో ఫోన్ లో మాట్లాడుతూ వచ్చే సన్నివేశం ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఇందులో భాగంగానే నాని వామ్మో మీ సినిమా అంటే అంతే సంగతులు. ఏళ్ళకు ఏళ్లు పట్టేస్తుంది అనేస్తాడు. దీనికి రాజమౌళి కూడా అంతే సరదాగా ఈసారి 3-4 ఏళ్లలోనే పూర్తిచేద్దాం నాని అంటూ కామెడీ చేస్తాడు. ఈ కామెడీని మీరూ ఎంజాయ్ చేయాలంటే ఈ వీకెండ్ మజ్నూ చూసేయండి…