'రాజా నరసింహా' సెన్సార్ పూర్తి

Friday,November 15,2019 - 10:10 by Z_CLU

మమ్ముట్టి హీరోగా మళయాళంలో సూపర్ హిట్టైన ‘మధుర రాజా’ సినిమా తెలుగులో ‘రాజా నరసింహా’గా రిలీజవుతుంది. నవంబర్ 22న గ్రాండ్ గా విడుదలవుతున్న ఈ సినిమా లేటెస్ట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. 150 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో మమ్ముట్టి పవర్ ఫుల్ క్యారెక్టర్ , యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలుస్తాయి.

వైశాక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అను శ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు ,తమిళ హీరో జై ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వైశాక్ గతంలో డైరెక్ట్ చేసిన ‘పులి మురుగన్’ సినిమా తెలుగులో ‘మన్యం పులి’అనే టైటిల్ తో డబ్బింగ్ సినిమాగా విడుదలై మంచి విజయం సాదించింది. మరి అదే కోవలో ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడం ఖాయమనిపిస్తుంది.