ఫోకస్ లోకి స్టార్ కిడ్స్

Friday,November 15,2019 - 12:48 by Z_CLU

మహేష్ బాబు కూతురు సితార… బన్ని పిల్లలు అల్లు అర్హ.. అల్లు అయాన్.. ఫ్యాన్స్ ని టోటల్ గా మెస్మరైజ్ చేస్తున్నారు. వీళ్ళేమీ ఫస్ట్ టైమ్ న్యూస్ లోకి వచ్చిన వాళ్ళు కాదు. రెగ్యులర్ గా ఏదో రకంగా స్టార్స్ పర్సనల్ ఫోటోస్ లోనో.. వీడియోస్ లోనో కనిపించే వాళ్ళే… కానీ ఈసారి ప్రొఫెషనల్ గా ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు.

 

మహేష్ బాబు కూతురు సితారకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త వీడియోస్ తో ఫ్యాన్స్ కి అందుబాటులోనే ఉంటుంది. అయితే ‘Frozen2’ లో డబ్బింగ్ చెప్పడంతో సితార… స్టార్ కిడ్ అనే ఇమేజ్ కి మరో మెట్టు ఎక్కేసిందనిపిస్తుంది.

అల్లు అర్హ.. అల్లు అయాన్.. మోస్ట్ అడోరబుల్ కిడ్స్.. ఇప్పటి వరకు అల్లు అర్జున్ పర్సనల్ గా సోషల్ మీడియాలో షేర్ చేసుకునే వీడియోస్ తో ఫ్యాన్స్ కి చాలా దగ్గరయ్యారు ఈ కిడ్స్. అందుకే ‘అల…’ మేకర్స్ రీసెంట్ గా రిలీజైన OMGDaddy సాంగ్ టీజర్ ని వీళ్ళపై చిత్రీకరించి రిలీజ్ చేశారు.. దాంతో సాంగ్ కి మరింత క్రేజ్ వచ్చి పడింది. అలా ఈ అల్లు వారి మోస్ట్ యంగ్ కిడ్స్ కూడా ఫోకస్ లోకి వచ్చేశారు.

గతంలో రవితేజ కొడుకు ‘మహాధన్’ కూడా ‘రాజా ది గ్రేట్’ లో నటించి తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకున్నాడు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా రియల్ లైఫ్ మూమెంట్స్ లలో కనబడే స్టార్ కిడ్స్ ఇలా ప్రొఫెషనల్ గా ఎంటర్ టైన్ చేసేసరికి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.