ఏప్రిల్‌ 26న 'భరత్‌ అనే నేను' రిలీజ్

Tuesday,February 13,2018 - 04:59 by Z_CLU

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం ‘భరత్‌ అనే నేను’. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. దీనికి కొనసాగింపుగా పూణెలో మరో షెడ్యూల్ ఉంటుంది. మార్చి 27కి టోటల్ షూటింగ్ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్-కొరటాల కాంబోలో వస్తున్న సినిమా ఇది.

నిజానికి ఈ సినిమాను కూడా ఏప్రిల్ 27నే విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ చెప్పిన తేదీకి ఒక రోజు ముందే తీసుకొస్తున్నారు. సినిమాలో మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.