నాగశౌర్య కొత్త సినిమా ఫస్ట్ లుక్

Tuesday,February 13,2018 - 04:34 by Z_CLU

ఛలో’ లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తరవాత నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మరింత బిజీ అయ్యాడు. ఇప్పటికే యూత్ లో క్రేజ్ క్రియేట్ చేసుకున్న నాగశౌర్య త్వరలో ’అమ్మమ్మ గారిల్లు’ సినిమాతో ఎంటర్ టైన్ చేయనున్నాడు. వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ‘రిలేషన్ షిప్స్ నెవర్ ఎండ్’ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ సినిమాలో నాగశౌర్య సరసన షామిలీ హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాతో సుందర్ సూర్య డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ‘ఓయ్’ సినిమా తరవాత లాంగ్ గ్యాప్ తీసుకున్న శాలిని, ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలుస్తుందంటున్నారు ఫిల్మ్ మేకర్స్. డిఫెరెంట్ కంటెంట్ తో సినిమాలను ఎంచుకుంటున్న నాగశౌర్య, తన కరియర్ లో ఫస్ట్ టైమ్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటించడం థ్రిల్లింగ్ గా ఉందని చెప్పుకున్నాడు.

కళ్యాణ్ రమణ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకలో రావు రమేష్, పోసాని కృష్ణ మురళి కీ రోల్స్ ప్లే  చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు.