పర్ఫెక్ట్ ప్లానింగ్ తో మహేష్

Sunday,April 29,2018 - 11:10 by Z_CLU

ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ సక్సెస్ ఎంజాయ్మెంట్ లో ఉన్న  మహేష్ జూన్ నుండి వంశీ పైడిపల్లి సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నాడు. ఈ సినిమా తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సుకుమార్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత మహేష్ ముగ్గురు గ్యారెంటీడ్ డైరెక్టర్స్ తో సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు. అందులో రాజమౌళి..త్రివిక్రమ్ తో పాటు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి కూడా ఉన్నాడు.

ఆ మధ్య 2019 లో రాజమౌళి తో సినిమా ఉంటుందని చెప్పిన మహేష్ ఇటివలే త్రివిక్రమ్, సందీప్ రెడ్డిలతో కూడా సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ ముగ్గురిలో సుక్కు సినిమా తర్వాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడా..అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానేి ఉంది. భరత్ అనే నేను ఇచ్చిన ఉత్సాహంతో పర్ఫెక్ట్ డైరెక్టర్స్ తో సినిమాలు ప్లాన్ చేస్తూ వాటిపై ఇప్పటి  నుండే ఫోకస్ పెడుతున్నాడు.